పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0243-2 పాడి సంపుటం: 08-254

పల్లవి:

తాఁకనేల వంగనేల తలఁచుకో యిఁకనైనా
సోఁకోరిచితేఁ బనులు చొప్పణఁగుఁగా

చ. 1:

పల్లదము లాడఁగానె పంతము లియ్యవలనె
అల్లదివో విభుఁడ నేఁ డాఁడు వారికి
మొల్లమి నీపాటిబుద్ధి మునుపనె కలిగితె
వొల్లనె దొరతనాన నుండవచ్చుఁగా

చ. 2:

చేతులు ఫైఁజాఁచఁగాను సిగ్గులు వడవల
యేతువ లెత్తా దించుక యిందరిలోన
నీతి విచారించుకొని నెమ్మది గుట్టుననుంటె
రీతితోఁ బెద్దరికము రేఁచుకొనవచ్చుఁగా

చ. 3:

కాఁగిలించుకొనఁగానె కైవము గావలసె
మాగిన మోవితేనెల మముబోఁటికి
చేఁగదేరఁ గూడితివి శ్రీవెంకటేశ నేఁడు
నాఁగువార్ల మీఁద మీఁద నవ్వువచ్చుఁగా