పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0241-5 శుద్దదేశి సంపుటం: 08-245

పల్లవి:

కాఁతాళించి వున్నది నీకడ సుద్దులెల్లా విని
చేఁతలేమిఁ జూపక చేరి వూరకుండుమీ

చ. 1:

వనిత నీచిత్తము రావలసి యిందాఁకాను
వొనర నన్నిమాఁటలు నోరిచెఁగాని
చెనకి నీవె యిఁక చేతులెత్తి మొక్కినాను
కొనచూపుటలుగులఁ గుచ్చి యెత్తుఁ జుమ్మీ

చ. 2:

అతివ నిన్ను మెప్పించె అందుకొర కిందాఁకాను
చతురత మోనములు జరపెఁగాని
యితవుగా నీవె యిఁక నిచ్చకము లాడినాను
రతిరాజు గుఱ్ఱాల నోరనే తోలుఁజుమ్మీ

చ. 3:

చెలి నీవు గూడిన యీసిగ్గున నిందాఁకాను
మొలకనవ్వులు లోలో మొరఁగెఁగాని
నెలవై శ్రీ వెంకటేశ నీవె యెంతవేఁడుకొన్నా
తలిరు మోవిపైని ముద్రలు వెట్టుజుఁమ్మీ