పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0240-2 నారాయణి సంపుటం: 08-236

పల్లవి:

ఇల్లాండ్లెరిఁగిరా యింతేసి సోదించ
కల్లలు నిజాలుసేయఁ గడకూ నేరుతువు

చ. 1:

చెప్పరాని కూరిమితో చేరి నావద్దనుందువు
యెప్పుడో ఆపె యింటికి నేఁగి వత్తువు
చొప్పులు నీమేన నవె చూపి చెప్పరాదు మాయ
నెప్పున నీవొళ్లి కల్ల నీవె యెరుఁగుదువు

చ. 2:

అరిది నాపొత్తున నీవారగించె వుండుదువు
సరినాపె విందెప్పుడో చవి చూతువు
సరవులె అట్టున్నవి చాటిచెప్ప గురిలేదు
నిరతపు నీసుద్దులు నీవె యెరుఁగుదువు

చ. 3:

శ్రీ వెంకటేశ నన్నె చేకొని కూడుండుదువు
యేవేళనో కాఁగి లాపె కెరవిత్తువు
భావనలె యింతెకాని పచారించరాదు మరి
నీవిధములన్నియును నీవె యెరుఁగుదువు