పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0236-1 పాడి సంపుటం: 08-211

పల్లవి:

ఇందుకుఁగా నెవ్వర మరేమిసేసేరు
మందెమేళమోపకున్న మరియూ మొక్కేను

చ. 1:

చనవు గలుగఁగానె చవిగాక వలపులు
మనసు లెరవులైతే మరిచప్పనే
యెనసితివంటా నిన్ను నిట్టె తిట్టితిఁగాక
పెనచి యెగ్గుపట్టితే బెరసి మొక్కేను

చ. 2:

నగఁగానె సరసాన నయమెక్కుఁ దీపులు
సొగయకుండితేఁ దమచూపులేవెట్ట
తగిలితివంటా నీముందల నేముట్టితిఁగాక
బిగువంతగలిగితే పిలిచి మొక్కేను

చ. 3:

మెఱసి కూచుండగానె మేకొను కూటములు
గుఱుతులు సోఁకకున్న కూడదువాని
నెఱి శ్రీవెంకటేశ మన్నించఁగా గూడితిఁగాక
తఱి నలసితినంటే దగ్గరి మొక్కేను