పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0203-5 కేదారగౌళ సంపుటం: 08-017

పల్లవి:

విన్నవించనేమున్నది వేగినంతాను
యిన్నిటా నీసొమ్ము నేను యీడేర్తువు గాక

చ. 1:

యెదురు చూచితి నీకు నింతులచేఁ జెప్పెంపితి
వెదకితి నీవుండేటి విడిదలను
చెదరని వలపులు చిమిడితేఁ గొరయౌనా
పదను దప్పకుండాను పాలింతువుగాక

చ. 2:

పట్టితి వ్రతము నీకు పైపైఁ దమకించితిని
బెట్టి పేరుకొని నిన్నుఁ బిలచితిని
వెట్టిగాని మనసిది వేఁచితేను చవియౌనా
యిట్టే ససివాడకుండా నేలుదువుగాక

చ. 3:

వేళలు గాచితి నీకు వేగించితి నిందాఁక
మూలమైనదేవరకు మొక్కుకొంటిని
యీలీల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
బాలకి నన్నిట్టే చేపట్టుదువు గాక