పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0223-3 మాళవిగౌళ సంపుటం: 08-135

పల్లవి:

విభుఁడు నీపై భుఁక్తితో వీఁడె వున్నాఁడు
సభఁలో మాకెల్లా నీవు చనవియ్యవమ్మా

చ. 1:

చలము సాదించఁగాను జగడాలు దిద్దరాదు
నలువంకఁ దగవులే నడపవమ్మ
వెలయుచుఁ దిట్టఁగాను విన్నపాలు సేయరాదు
చలువైన శాంతానఁ జక్కఁగావమ్మా

చ. 2:

సమ్మతించననఁగాను సందడి మాటాడరాదు
నిమ్మపండందుకొంటే నీవే నేనమ్మా
యెమ్మెలు నెరపఁగాను యియ్యకోలు సేయరాదు
వుమ్మడి‌ మీఁదటెత్తులు వూహించవమ్మా

చ. 3:

యింత సిగ్గుపడఁగాను యెరుకలు సేయరాదు
వింతలు సేయక తెర వేయవమ్మ
చెంతలనే నిన్నుఁగూడె శ్రీవేంకటేశుఁడు లోలో
బంతినే మోవితీపులు పచారించవమ్మా