పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0219-3 దేశా(సా)క్షి సంపుటం: 08-111

పల్లవి:

ఉపకారమింతేకాని వొరటుగాదు
కపటాలుమాని సతిఁగాఁగిలించవయ్యా

చ. 1:

మంకుగాదు చెలియ నీమనసు చూచేనంటా
వుంకువ సిగ్గులతోడ నూరకున్నది
సంకెగాదు నిన్నుఁ దనచన్నులు నాటించితేను
అంకెఁ గుమ్మెలయ్యీనంటా నట్టె మూసెఁ బయ్యద

చ. 2:

తిట్టుగాదు నీగుణము తెలుసుకొనవలసి
బెట్టిమాటలనిన్నుఁ బెదవులను
ఱట్టుసేయదాపె నిన్నాఱడిఁ బెనఁగకున్న
దిట్టతనము నేరక దిగేవంటాను

చ. 3:

గబ్బితనములుగాదు కాఁగిలించి పట్టినిన్ను
తబ్బిబ్బుగాకుండ రతిఁదనిపేనంటా
అబ్బురపు శ్రీవేంకటాధిప నిన్నుఁగలసె
జొబ్బిలఁ బ్రేమము నీకుఁ జూపేనంటాను