పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0202-3 రామక్రియ సంపుటం: 08-009

పల్లవి:

నీకంకణము గట్టినట్టి నెలఁత నేను
ఆ కంటు దీరుచవయ్యా ఆపరాధి నేను

చ. 1:

వెలఁదులు నిన్నాడఁగా వింటిని నేను
అలిగి పాసిన విరహపువేళల
పలికి వారిఁ దిట్టని పాపజాతిదాన నేను
యెలమి నన్నప్పటి నీవేల మెచ్చేవయ్యా

చ. 2:

మచ్చికై నీవిందుండఁగా మాయింటనే వుంటి నేను
రచ్చఁ జెలులు పంతాన రానియ్యరైరి
యిచ్చగించి వుండినట్టి యెడ్డగుణము సతిని
పచ్చిగా నాకేల నీవు బాఁతిపడేవయ్యా

చ. 3:

నీవు గాఁగలించుకోఁగా నివ్వెరగుతోనుండితి
ఆవేళ నన్నెచ్చరించరైరి చెలులు
కావిరి నూరకుండిన కడుమత్తురాలను నేను
శ్రీవేంకటేశ నన్నేల చెక్కునొక్కేవయ్యా