పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0058-2 ఆహిరి సంపుటం: 06-098

పల్లవి:

అంతకంతకును వెఱపయ్యీని
యెంత నను వలపించి యేఁపేవో యనుచు

చ. 1:

పయ్యె దెడలించి గుబ్బల నిన్ను నలమఁ బ్రియ
మయ్యీని మిగుల వెఱ పయ్యీని
గయ్యాళి రతుల ననుఁ గరఁగించి మరుబారి
నుయ్యాల పొలయలుక నూఁచేవో యనుచు

చ. 2:

వెడవెడని తమ్ములము వీడుదోడాడ మన
సడరీని తలఁప వెఱపయ్యీని
వడిలోక మేలు దేవర దివ్యవదనంబు
కడుల నెంగిలని యొరులుగందురో యనుచు

చ. 3:

గొప్ప సవరంబు నాకొప్పులో ముడిచేవు
అప్పటి నాకు వెఱపయ్యీని
చెప్పఁగడు నరు దైన శ్రీవేంకటేశ యిది
యిప్పు డెవ్వతెకు నీ విత్తువోయనుచు