పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0049-5 నాట సంపుటం: 06-047

పల్లవి:

తిరొ తిరొ జవరాల తిత్తి తిత్తి యీ
తరలమైన నీత(తా?)రహార మదురే

చ. 1:

ధిమి ధిమ్కి తోంగ తోంగ దిద్ధిమిక్కి ఆరే
మమారే పాత్రరావు మజ్జా మజ్జా
కమలనాభుని తమకపుటింతి! నీకు
నమరెఁదీరుపు ఇదే అవధరించఁగదో

చ. 2:

ఝకజక్క జంఝం ఝణణకిణాని
ప్రకటపు మురువొప్పె భళాభళా
సకలపతికి సరసపుగొమ్మా నీ
మొకసిరి మెరసె చిమ్ముల మురిపెములా

చ. 3:

మాయిమాయి యలమేలుమంగ నాచ్చారి మతిఁ
బాయని వేంకటపతి పట్టపురాణి
మ్రోయఁ జిరుగజ్జెలా నీ మ్రోత లానేని
సోయగమైన నీ సొలపుం జూ పమరే