పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0045-3 సౌరాష్ట్రం సంపుటం: 06-021

పల్లవి:

ఈడేరని యట్టి వలపేఁటికమ్మా
యీడు జోడుగాని వలపేఁటికమ్మా

చ. 1:

తనువు తనువు గూడి తమకము మీఁద మీఁద
నినుమడించని వలపేఁటికమ్మా
మనసు మనసు తోడ మక్కళించి సందు లేక
యెనసి వుండని వలపేఁటికమ్మా

చ. 2:

మచ్చికల చేఁతల మతి లోలురై తా
మిచ్చ యెఱుఁగని వలపేఁటికమ్మా
తచ్చనయలుకలతో ధన్యత ప్రేమల
యెచ్చకున్న యట్టి వలపేఁటికమ్మా

చ. 3:

పంతము చెరిచి వాఁడు పానుపు మీదికి వచ్చి
యింత సేయ లేని వలపేఁటికమ్మా
కంతు నిఁకేలని శ్రీ వేంకటపతి నన్ను గూడె
నింత హెచ్చులేని వలపేఁటికమ్మా