పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-1 ఆహిరి సంపుటం: 06-001

పల్లవి:

చిన్ని శిశువూ చిన్ని శిశువూ
యెన్నఁడుం జూడ మమ్మ యిటువంటి శిశువూ

చ. 1:

తోయపుంగురులతోడఁ దూ గేటి శిరసు, చింత
కాయలవంటి జడలగములతోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంటఁ బాఱాడు శిశువూ

చ. 2:

ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల
నిద్దపుంజేతుల పైఁడి బొద్దులతోడ
అద్దపుంజెక్కులతోడ నప్పలప్ప లనినంత
గద్దించి యశోద మేనుఁ కౌఁగిలించు శిశువూ

చ. 3:

బలుపైన పొట్ట మీఁది పాల చాఱల తోడ
నులి వేఁడి వెన్న దిన్న నోరి తోడ
చెలఁగి నేఁడిదె వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ