పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦౦96-౦6 మలహరి సం: 01-482 వైరాగ్య చింత


పల్లవి:
ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే
సన్నము దొడ్డునుఁ దోఁచీ సంసారఫలంబు

చ.1:
తిత్తితో నూరేండ్లకును దేహము పండఁగఁ బండఁగ
చిత్తం బెన్నఁడు పండక చిక్కెను కసుఁగాయై
పొత్తుల పుణ్యముఁ బాపము పులుసును తీపై రసమున
సత్తు నసత్తునుఁ దోచీ సంసారఫలంబు

చ.2:
వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు
పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే
తుదనిదె సుఖమునుదుఃఖముతోలునుగింజయి ముదురుక
చదురము వలయము తోఁచీ సంసారిఫలంబు

చ.3:
వినుకలిచదువుల సదలో వేమరు మాఁగఁగ బెట్టిన
ఘనకర్మపుటొ గరుడుగదు కమ్మర పులిగాయై
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుఁడు కానుక
చనవున నియ్యఁగ వెలసెను సంసారఫలంబు