పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦69-01 సామంతం సం: 01-358 శరణాగతి


పల్లవి:
దొరుకునా యితని కృప తుదిపదంబు
అరిది విభవము లొల్లమనినాఁ బొదలు

చ.1:
సొంపలర నితఁడు కృపఁజూచు టరుదని కాక
యింప్తు సామాన్యమా యితని కరుణ
లం పటము ఘనమైన లక్ష్మీకటాక్షములు
సంపదలు తోడనే చల్లు వెదలాడు

చ.2:
తగ నితనిపై భక్తి తగులు టరుదని కాక
నగుట సామాన్యమా ననచి యితఁడు
జగదేక హితములుగ సరసతలు సౌఖ్యములు
దిగులువాయఁగ నితడు దిప్పుదీరాడు

చ.3:
తిరువేంకటాద్రి సిద్దించు టరుదని కాక
మరుగఁ దను నిచ్చునా మరియొకరిని
యిరవైన భోగములు యిష్టసామ్తాజ్యములు
విరివిగొని యితని దయ వెంటనే తిరుగు