పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0౦48-03 పాడి సం: 01-295 కృష్ణ


పల్లవి:బలువగుఁ దనరూపము చూపె
       కలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్‌

చ.1:పాండవరక్షణపరుఁడై నరునకు
      నండనే తెలిపె మహమహిమ
      దండి విడిచి తనదయతో నర్జునుఁ-
      డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె

చ.2:మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములు
      తెగి పార్టున కుపదేశించె
      నగుచు నతనితో నానాగతులను
      నిగముమునియమమునిజ మెరిఁగించెన్‌

చ.3:వెరపుమిగుల నావిజయునిమనుమని
      పరీక్షిత్తుఁ దగఁ బ్రదికించె
      తిరువేంకటగిరిదేవుఁడు దానై
      గరిమల భా రతకథ గలిగించెన్‌