పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0038-01 దేసాక్షి సం: 01-231 అధ్యాత్మ


పల్లవి:వేసరితిఁయెట్ల నీవెంటఁ దిరిగి
       గాసిఁబెట్టక మమ్ముఁ గావరాదా

చ.1: తీసితివి కోరికల తెగనీక పంచలకు
      తోసితివి యింటింటఁ దోయఁదోయ
      చేసితివి నీచేఁత చెల్లె నిఁకనైనను
      ఆస నీపొందొల్ల మంపరాదా

చ.2: కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁ
      బెట్టితివి దుఃఖములఁ బెనచిపెనచి
      పట్టితివి చలము మము పాయనని యాస నీ-
      విట్టైన గొంతసుఖ మియ్యరాదా

చ.3:కఱపితివి పాపములే కడఁగి నానావిధుల
      నెఱపితివి దుర్షశలే నేర్చుమెరసి
      తెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని-
      నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో