పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'తరిగొండ వెంగమాంబ వాఙ్మయప్రాజెక్టు'ను ఏర్పరచి అందుకు పరిష్కర్తగా శ్రీ కె.జె. కృష్ణమూర్తిగారిని నియమించినారు. ఆ ప్రాజెక్టు "శ్వేత" ఆధ్వర్యంలో పనిచేసేట్టుగా ఆదేశించినారు. స్వయాన సాహితీప్రియుణ్ణి అయిన నాకు తరిగొండ వెంగమాంబను గురించి తెలుసుకునే అవకాశం ఈ రకంగా కలిగింది. వెంటనే ఆమె సాహిత్యంమీద రెండు రోజులు జాతీయ సాహితీసదస్సు నిర్వహించటం, అనంతరం పుస్తకముద్రణతో పాటు, ఆమె పాటలకు బాణీలు కూర్పించి, ఆడియో సి.డి.లుగా విడుదల చేయటానికి పూనుకున్నాను. తిరుమల-తిరుపతి దేవస్థానముల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆమె జన్మదినం సందర్భంగా రెండు రోజులపాటు సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించతలపెట్టినాను. అతి త్వరలో అన్ని పుస్తకాల ముద్రణ, పాటల ఆడియో సి.డి.ల విడుదల పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాము.

ఈ బృహత్ కార్యక్రమము సఫలీకృతం కావటానికి పూర్తి కారకులు శ్రీ ఏ.పి.వి.యన్.శర్మగారు; మా ప్రియతమ కార్యనిర్వహణాధికారి. వారికి తెలుగు సాహితీ, సంగీత ప్రియుల పక్షాన ధన్యవాదాలు.

బి.యస్. రెడ్డి

సంచాలకులు

"శ్వేత"