పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తొలఁగక మేటి కోటకును త్రోవలు తొమ్మిది, దానిలోపలన్
బలిమిగ నంచెలంచెలను పట్టుగ నాల్గురు [1]కావలుందు, రా
వల నొక యేడు చిల్కలును వాసిగఁ బల్కుచునుండు, దానిలోఁ
గొలఁకులు రెండు నుండుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

46

భావం:

దయాసాగరుడవై తరిగొండలో విరాజిల్లుతూవున్న శ్రీ లక్ష్మీనరసింహదేవా! ఈ 'కోట'కు (శరీరానికి తొమ్మిదిత్రోవ లున్నాయి. ఈకోటయందు ఆ యా అంచెలలో ఆరుగురు బలమైన పట్టుదలతో కావలి కాస్తూవున్నారు. ఈ కావలివాండ్రకు ఆవల ఏడు చిలుకలు ప్రశస్తంగా పలుకుతున్నాయి. అచ్చట రెండు సరోవరాలు ప్రకాశిస్తూ వున్నాయ

(కవయిత్రి ఈ పద్యంలో మానవదేహంలోని షట్చక్రాలు మొదలయిన యోగవిద్యావిశేషాలను మర్మకవితాధోరణిలో వెల్లడించింది.)

  1. 'కావలి+ఉందురు'- అని పదవిభజనము