పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పాటుగ నాత్మదేశమునఁ బన్నుగ వెన్నెల గాయుచుండు, బల్
ఆటకమైన యేడు ఘనఆవరణంబులు నుండు, దానిలో
[1]మేటగు సర్పము న్నొకటి మేరువుమీఁదను [2]కావలుండు, నీ
కోట విధంబుఁ గంటి; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

45

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఆత్మయొక్క దేశంలో ఎప్పుడూ సొంపుగా వెన్నెల కాస్తూవుంటుంది. ఈదేశంలోనే ఏడు గొప్ప ఆవరణలు నెలకొనివున్నాయి. అందులో శ్రేష్ఠమైనసర్పం ఒకటి మేరువుపైన (అగ్రభాగంలో) కావలికాస్తుంటుంది. ఇటువంటి కోటతీరును నీ దయవల్ల నేను కనుగొన్నాను.

  1. 'మేటి+అగు' అని పదవిభాగము
  2. 'కావలి+ఉండు' అని పదవిభాగము