పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95

39. మౌల్వీ అలీ ముసలియార్‌

(1853- 1922)

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 120 సంవత్సరాలు పోరుబాటన సాగి, 1922 ప్రాంతంలో ఖిలాఫత్- సహాయనిరాకరణ ఉద్యమంలో విలీనమైపోయిన మలబారు మోప్లా యోధుల వారసులు మౌల్వీ అలీ ముస్సలియార్‌.

కేరళ రాష్ట్రం మలబారు ప్రాంతంలోని తూర్పు మంజేరిలో గల పండిక్కడ్‌ సమీప గ్రామం నెల్లిక్కుట్టులో 1853లో అలీ జన్మించారు. ప్రాధమిక విద్య తరువాత, ధార్మిక విద్యకోసం మక్కా వెళ్ళిన ఆయన ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి లక్షదీవులలోని కనారట్టి ద్వీపంలోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేప్టారు.

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మలబార్‌ మోప్లాలు సాగిస్తున్న పోరాటాలలో భాగంగా 1894, 1897లో జరిగిన తిరుగుబాట్లల్లో మౌల్వీ కుటుంబ సబ్యులంతా బ్రిటిష్‌సైనికుల ఊచకోతకు గురయ్యారు. గ్రామాలలో ఒకవైపు న భూస్వాములు, మరోవైపు పాలకవర్గాల వలన మలబారు పేద రైతాంగం ఎదుర్కొంటున్న ఇక్కట్లను గమనించిన ఆయన కరడు గట్టిన బ్రిటిష్‌ వ్యతిరేకవాది గాను, జాతీయభావాలను నరనరాన నింపుకున్నపోరాట యోధుని గాను రూపుదాల్చి 1921-1922 మధ్యలో జాతీయోద్యమంలో భాగంగా మలబారులో సాగిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు కేంద్రమయ్యారు.

చిరస్మరణీయులు