పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

93

38. ఫజులుల్లా ఖాన్‌

(- 1922)

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న పలువురు యోధుల చరిత్రలు ప్రజాదరణ పొందిన చరిత్ర గ్రంథాలలో చోటు చేసుకోకపోవటం వలన ఆ యోధుల త్యాగాలు, సాహసోపేత చరిత్రలు ప్రజాబాహుళ్యానికి అందకుండా పోయాయి. అలాంటి అలనాటి ఆజ్ఞాతయోధులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫజులుల్లా ఖాన్‌ ఒకరు.

భారతదశంలో సహాయ నిరాకరణ, ఖిలాఫత్,శాసనోల్లంఘన ఉద్యమాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మన్య విప్లవం జరిగింది. ఆ సమయంలో మన్యంలో అల్లూరి తండ్రి వెంకట్రామరాజుకు సహాధ్యాయి, మిత్రుడు ఫజులుల్లా ఖాన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో డిపుటీ కలక్టరుగా పని చేస్తున్నారు. ఆయనకు తన మిత్రుని కుమారుడైన అల్లూరిని ఇబ్బందుల పాల్జేయటం ఇష్టంలేకపోయింది. అందాువలన రాజుకు అనుకూలంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని పొన్నలూరిరాధాకృష్ణమూర్తి 1935లో రాసిన మన్యంలో విప్లవం-అల్లూరి సీతారామరాజు గ్రంథం ద్వారా వెల్లడైంది. బ్రిటిష్‌ ప్రబుత్వం చేత నిషేధానికి గురైన ఆ గ్రంథంలో 'తన స్నేహితుని కుమారుని (రాజు) ప్రమాదములలో బడద్రోయుటకు మనసొప్పలేదు. తనకు (ఫజులుల్ల్లా ఖాన్‌) గల అధికారము మూలమున రక్షణ చేయదలచెను' అని పొన్నలూరి పేర్కొన్నారు.

చిరస్మరణీయులు