పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83

33. మౌల్వీ అబ్దుల్‌ రసూల్‌

(1872-1917)

జాతీయోద్యమానికి బలమైన పునాదిగా మారిన బెంగాలు విభజన వ్యతిరేకపోరాటంలో భాగస్వామ్యం వహించి తమ జీవితాలను చిరస్మరణీయం చేసుకున్నజాతీయోద్యమకారులలో మౌల్వీ అబ్దుల్‌ రసూల్‌ అగ్రగణ్యులు.

1872లో మౌల్వీ రసూల్‌ సంపన్నకుటుంబంలో జన్మించారు. తండ్రి మౌల్వీ గులాం బెంగాలులో జమీందారు. 1889లో ఇంగ్లాండ్‌ వెళ్ళి 1898లో న్యాయశాస్రంలోBCL డిగ్రీ పుచ్చుకుని ఇండియా వచ్చిన రసూల్‌ ఆ డిగ్రీ తీసుకున్న ప్రథమ బెంగాలీగా చరిత్ర సృష్టించారు. న్యాయవాదవృత్తిని చేపట్టి అతి కొద్దికాలంలో ప్రతిభావంతుడైన న్యాయవాదిగా గణుతికెక్కారు.

1905లో లార్డ్‌ కర్జన్‌ బెంగాలును విభజించాడు. ఆ చర్యను వ్యతిరేకిస్తూ చరిత్రప్రసిద్ధి చెందిన బెంగాలు విభజన వ్యతిరేక ఉద్యమం ఉనికిలోకి వచ్చింది. ప్రజల ఆగ్రహజ్వాలల్లో నుండి వందేమాతరం నినాదం ఉద్యమ స్పూర్తి అయ్యింది. ఆ ఉద్యమం ద్వారా అబ్దుల్‌ రసూల్‌లోని జాతీయ భావాలు పురివిప్పాయి. బెంగాల్‌ను చీల్చి ప్రజల ఐక్యతకు గండికొట్టి, హిందూ-ముస్లిల మధ్యన చిచ్చుపెట్టాలన్న ఆంగ్లేయుల కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమించి మౌల్వీరసూల్‌ స్వాతంత్య్ర పోరాట యోధునిగా నూతన జీవితం

చిరస్మరణీయులు