Jump to content

పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

ఆరంభించారు. బెంగాల్‌ విభజన కుట్రకు వ్యతిరేకంగా 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్‌హాలులో అన్ని సాంఫిుక జనసముదాయాల ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రముఖ పాత్ర వహించటం మాత్రమే కాకుండా తొలిసారిగా గళం విప్పారు.

ఆ తరువాత అబ్దుల్‌ రసూల్‌ న్యాయవాద వృత్తిని త్యజించి, బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. బెంగాల్‌ అంతా కలయ తిరుగుతూ సభలు సమావేశాలు నిర్వహించారు. బెంగాల్‌ విభజనను వ్యతిరేకించాల్సిన అవసరాన్ని వివరిస్తూ, హిందూ-ముస్లింల స్నేహ సంబధాల ఆవశ్యకతను ఉద్బోధిస్తూ అయన సాగిస్తున్న విస్త్రుత ప్రచారం ప్రభుత్వానికి కంటక ప్రాయమైంది. మౌల్వీ రసూల్‌ను నిరోధించేందుకు ఆయనను మానసికంగా, భౌతికంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఇబ్బందులు పాల్జేసినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆయన ముందుకు సాగారు. ఆయనకున్న ప్రత్యేక విదేశీ అలవాట్లనే కాకుండా, విదేశీ వస్తువులకు కూడా ఆయన దూరమయ్యారు. స్వదేశీ వస్తువులను స్వీకరించటమే కాకుండా ఆవస్తువుల వాడకాన్ని ప్రోత్సాహించడానికి ఆచరణాత్మక వ్యూహం రూపొందించి ప్రజలలో ప్రచారం గావించారు. బెంగాల్‌ను చీల్చినట్టు హిందూ-ముస్లింలను కూడా విభజించడానికి వలస ప్రభుత్వంపన్నుతున్న కుట్రలను తూర్పారబట్టారు. ఆయన సమరశీల ప్రసంగాలకు, ప్రచార కార్యక్రమాల ప్రభావాన్ని గుర్తించిన ప్రభుత్వంఆగ్రహించి ఆయన నిర్వహిస్తున్న పలు పదవులు, ఉన్నతోద్యాగాల నుండి తప్పించడం మాత్రమే కాకుండాపలు శిక్షలకు కూడా గురిచేసింది.

మౌల్వీ రసూల్‌ జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహిస్తూనే ముసింల ప్రగతిని కాంక్షిస్తూ బెంగాలు మహమ్మదన్‌ అసోసియేషన్‌ లాంటి సంఘాలను స్థాపించి, వాటి ద్వారా జాతీయ, సెక్యులర్‌ భావాల పరివ్యాప్తికి అవిశ్రాంతంగా కృషి చేశారు. 1907 మార్చిలో బెంగాలులో జరిగిన మతకలహాల సందర్బంగా కల్లోల ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి హిందూ-ముస్లింలు పరస్పరం సోదరులుగా భావించి రాఖీలు కట్టుకోవాలని కోరుతూ రాఖీ బంధన్‌ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

1916లో అనిబిసెంట్ ఆరంభించిన హోంరూల్‌ ఉద్యమంలో మౌల్వీచాలా చురుగ్గా పాల్గొంటూ ఉద్యమంలో మార్గదర్శక పాత్రను పోషించారు. ఈ ఉద్యమాన్ని ఆయన ఎంతగా ప్రేమించారంటే ఉద్యమ గుర్తుగల చేతిగడయారాన్ని తన భౌతికకాయంతోపాటు సమాధి చేయాలని కోరారు.ఈ మేరకు కోర్కెను వెల్లడించిన అతి కొద్ది రోజులకు అనగా 1917 సెప్టెంబరులోమౌల్వీ అబ్దుల్‌ రసూల్‌ ఆకస్మింగా కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌