పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47


15. మౌల్వీ అహ్మదుల్లాషా ఫైజాబాది

(1787-1858)

బ్రిటీషర్ల పై కత్తిగట్టి వారి సైనిక బలగాలను పలుమార్లు మట్టికరిపించి ఆంగ్లేయ శిబిరాలలో దడ పుట్టించిన యోధుడుగా ఖ్యాతిగాంచి, ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అగ్రస్థానం పొందిన అసమాన పోరాట వీరుడు మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌.

మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌ తండ్రి ముహమ్మద్‌ అలీ ఖాన్‌. ప్రస్తుతం చెన్నయ్‌గా పిలువబడుతున్నచెన్నపట్నంలో 1787-88లో జన్మించారు. మౌల్వీ అసలు పేరు సయ్యద్‌ అహ్మద్‌ అలీ ఖాన్‌. చిన్నతనంలోనే ఆయన ధార్మిక, లౌకిక విద్యలో సాధించిన విద్వత్తు ఫలితంగా 'మౌల్వీ'గా ప్రసిద్ధిగాంచారు. స్వదేశీ భాషలలోనే కాకుండా ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని కూడా సంతరించుకున్న ఆయన పలు యుద్ధవిద్యలలో ఆరితేరారు.

ఒకసారి నైజాం నవాబు ఆహ్వానం మేరకు హైదరాబాదుకు విచ్చేసిన సందర్భంగా మౌల్వీ అహమ్మదుల్లా ప్రతిభను గమనించిన బ్రిటిష్‌ సైనికాధికారులు ఆయనను ఇంగ్లాండుకు ఆహ్వానించారు. ఆ ఇంగ్లాండు పర్యటన తరువాత ఆయన మక్కా-మదీనా, ఇరాక్‌, ఇరాన్‌, తదితర ప్రాంతాలను కూడా పర్యటించి స్వదేశం చేరుకున్నారు. స్వదేశం వచ్చిన మౌల్వీ అహ్మదాుల్లా ఖాన్‌ సూఫీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఖాద్రి సంప్రదాయానికి చెందిన సయ్యద్‌ ఫుర్‌ఖాన్‌ అలీ షా (Syed Furqan Ali Sha) శిష్యులయ్యారు. గురువాజ్ఞ

చిరస్మ రణీయులు