పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

213

98. డాక్టర్‌ జైనుల్లాబ్దిన్‌ అహమ్మద్‌

(1909- )

పరపాలకుల పీడన నుండి దేశాన్ని విముక్తం చేయడమే కాకుండా దోపిడి నుండి శ్రమజీవులను విముక్తం చేయాలన్న మహతర లక్ష్యంతో జాతీయోద్యామానికి అంకితమైన మహనీయులలో ఒకరు డాక్టర్‌ జైనుల్లాబిద్దీన్‌ అహమ్మద్‌.

1909 అక్టోబర్‌ 29న సింధ్‌ ప్రాంతంలోని ఒమర్‌కౌట్ లో జెనుల్లాబిద్దీన్‌ జన్మించారు. 1924లో ఉన్నత విద్యకోసం అలీఘర్‌ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసాక 1928లో ఇంగ్లాండ్‌లోని 'లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌' నుండి 1935లో డాక్టరేట్ పట్టాను పొందారు.

1936లోఇండియా వచ్చి అటు జాతీయోద్యమం పట్ల ఇటు కమ్యూనిజం పట్ల ఆకర్షితు లయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వం డాకర్‌ అహమ్మద్‌ను ప్రబుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆహ్వానించినా జాతీయ భావాలతో ప్రభావితుడైన ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించారు.ఆయన మనస్సు వలస పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని, అనంతరం అసమానతలు, అంతరాలు లేని భవ్య భారతదేశ నిర్మాణం కోసం కృషి సాగించాలని నిర్ణయించుకుంది.

ఆ క్రమంలో ఆయనకు ఇంగ్లాండ్‌లో పరిచయమైన హజరా బేగంను 1936లో

చిరస్మరణీయులు