పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

193

88. షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌

(1904-1970)

జాతీయోద్యమంలో ప్రత్యేక స్థానం సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు గడ్డ అందించిన విద్యార్థి-యువజనోద్యమ నేతలలో ఒకరు షేక్‌ గాలిబ్‌ సాహెబ్‌ ఒకరు.

1904 లై 15న గుంటూరులో ఆయన జన్మించారు. షేక్‌ చింగిషా, షేక్‌ అమీనాబి ఆయన తల్లిదడ్రులు. విద్యార్థిగా నున్నప్పుడే జాతీయోద్యమం పట్ల ఆకర్షితులెన ఆయన బ్రిటిష్‌ దాస్యశృంఖలాల నుండి విముక్తి కోసం గుంటూరు యోధులు సాగిస్తున్న పోరాటాల ద్వారా ప్రేరణ పొందారు. ఆ వాతావరణం ఆయనను చదువు మీద దృష్టి నిల్పనివ్వలేదు. ఆ ప్రబావంతో జాతీయోద్యమంలో ప్రవేశించాలనుకున్న గాలిబ్‌ 1928లో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు.

జాతీయోద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు, ప్రజల్లోకి ఉద్యమ లక్ష్యాలను మరింత వేగంగా, బలంగా తీసుకువెళ్ళేందుకు యువజనుల, విద్యార్దుల శక్తిని గమనించిన ఆయన యువజన-విద్యార్థి సంఘాల నిర్మాణం మీదా దృష్టి సారించారు. గుంటూరు పట్టణంలో యువజన, విద్యార్థి ఉద్యమాలను పటిష్టం చేసి బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర నిర్వహించేట్టుగా సహచరు లతో కలసి యువజన విద్యార్థి సంఘాలను తీర్చిదిద్దారు .

ఆది నుండి గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాల పట్ల అమిత గౌరవంగల ఆయన, మహాత్ముని ఆలోచనలన్నిటిని అలిఖిత ఆదేశాలుగా ఆచరించారు. ఆయన జీవితాంతం

చిరస్మరణీయులు