పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

తనదైన పాత్ర నిర్వహించేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు.

స్వేచ్ఛా, స్వాతంత్య్రాల దిశగా సాగుతున్న జాతీయోద్యామం సంపూర్ణ విజయం సాధించి స్వరాజ్యం స్థాపించాలంటే, ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యం కావాల్సి ఉందని బేగం మజిదా భావించారు. ఆ కారణంగా మతం పేరుతో వేర్పాటువాద రాజకీయాలు నడుపుతున్నముస్లిం లీగ్ నాయకుల తీరుతెన్నులను విమర్శించారు.1936లో జరిగిన ఓ ప్రదర్శనలో జాతీయవాదులైన కొందరు యువకులు ఏర్పాటు చేసిన ఆజాద్‌ ముస్లిం లీగ్ లో ఆమె భాగస్వాములయ్యారు. ఆజాద్‌ లీగ్ ఆఅధ్యర్యంలో జరిగిన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలీగ్ అధినేత ముహమ్మద్‌ అలీ జిన్నాకు వ్యతిరేకంగా బేగం మజీదా బానో నినదించి సంచలనం సృష్టించారు.

1935 భారత చట్టం ప్రకారంగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రజలందరి ప్రతినిధిగా ఎన్నికల రంగంలో దిగగా, ముస్లింలీగ్ తాను ముస్లింల ప్రతినిధిగా ప్రకటించుకుంది. ఆ ఎన్నికలలో లక్నోమహిళా నియోజకవర్గం నుండి మజీదా బానో జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేశారు. ఆమె ముస్లిం లీగ్ అభ్యర్ధి బేగం ఇనాం హబీబుల్లాతోపోటీపడ్డారు . ఈ ఎన్నికలలో మౌలానా అలీ సోదరు లలో ఒకరైన మౌలానా షౌకత్‌ అలీ తదితర ప్రముఖ నాయకులు లీగ్ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మౌలానా షౌకత్‌ అలీ ఖురాన్‌ గ్రంథాన్ని చేత బూని ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజల నుండి వాగ్దానం చేయించుకోవడాన్నిబట్టి, ఆ ఎన్నికలను ముస్లిం లీగ్ నేతలు ఎంత ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నారో అర్ధంచేసు కోవచ్చు. జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థి మజీదా బానో పక్షాన కాంగ్రెస్‌ నేతలు, లక్నో విద్యార్థులు ప్రచారం చేశారు. ముస్లిం లీగ్ నేతల వాదనలను పూర్వపక్షం చేస్తూ , మత సామరస్యం కోరుతూ మజీదా పర్దాతోపాటే విశ్రుతంగా పర్యటనలు జరిపారు. ఆ ఎన్నికలలో కవలం 175 ఓట్ల తేదతో ఆమె ఓటమి చెందారు. జయాపజయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండ హిండోఓ-ముస్లింల ఐక్యతా నినాదము మాత్రమే కాకుందభారతీయులందరి ఐక్యతను ఆకాంక్షిస్తూ, మతోన్మాద రాజకీయ నేతల ఎత్తులను ఎదుర్కొంటూ, విభజన రాజకీయాలను తీవ్రంగా నిరసిస్తూ ముందుకు సాగారు.

స్వదేశానికి స్వరాజ్యం సిద్ధించాక దేశసేవకు అధిక ప్రాధాన్యతనిచ్చి, చివరి క్షణం వరకు మత సామరస్యం ప్రధానక్ష్యంగా కృషి చేస్తూ, అటు దేశసేవలో ఇటు ప్రజా సేవలో పూర్తి కాలాన్ని గడిపిన బేగం మజీదా బానో 1974 ఫిబ్రవరి 12న బీహార్‌ రాష్ట్రం బారాబంకీలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌