పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

విచారణాంతరం రెండు సంవత్సరాల జైలు, రు.500 జరిమానా విధించింది. జరిమానా కట్టలకపోవటం వలన ఆయన సమకూర్చుకున్న అమూల్య గ్రంథాలను జప్తుచసి పోలీసులు పట్టుకెళ్ళారు. అప్పటి నుండి జాతీయోద్యమ కాలంలో ఆయన అత్యధిక సమయం జైలులో గడిచింది. స్వదేశీ ఉద్యమానికి ఊపిరి పోసేందుకు భార్య నిషాతున్నీసా బేగం తో కలసి భారతదేశం లోని ప్రథమ 'స్వదేశీ స్టోర్స్‌' ను ప్రారంభించారు.

ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఆ సందర్భంలో మోహాని పలుమార్లు హైదారాబాద్‌ సందర్శించి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమ ప్రచారం గావించారు. 1921లో అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశం నుండి 'సంపూర్ణ స్వరాజ్యం' తీర్మానాన్ని ప్రతిపాదిస్తు వచ్చారు. గాంధీజీ అహింసా సిద్దాంతాలు అన్ని సమయాలలో అనుసరించ దగినవి కావన్ననిక్కచ్చి అభిప్రాయాలను వెల్లడించి స్వయంగా గాంధీజీ ప్రశంసలందాుకుమ్మారు. సంపూర్ణ స్వfiరాజ్యం సాధించేందుకు హిందూ-ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నమ్మిన ఆయన, 1927-28లో కలకత్తాలో జరిగిన ఐక్యతా సమావేశాల నిర్ణయాలను హిందూ సోదారులు నిరాకరించటంతో వ్యధకు గురయ్యారు.

మహాత్మాగాంధీ విధానాలు కొన్ని నచ్చక 1928లో కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చారు.1929 అక్టోబరు 31 నాటి లాహోర్‌ సమావేశంలో జాతీయ కాంగ్రెస్‌ సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేయడంతో ఆయన కల నిజమైంది. ఆ తరువాత ముస్లిం లీగ్ కు దగ్గరైన ఆయన 1946లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముసింలీగ్ అభ్య ర్థిగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు. ముస్లిం లీగ్ సభ్యుడిగా ఉన్నా కూడా జిన్నా వేర్పాటు వాదాన్నిదైర్యంగా ఎదుర్కొన్నారు.భారత విభజనను అడుగడు గున వ్యతిరేకించారు.1947లో భారతదేశం చీలిపోవటంతో బాధపడ్డారు. ఆ తరువాత కూడా రాజకీయాలలో గడిపిన ఆయన పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ నుండి పలుమార్లు ఎన్నికయ్యారు.

ఆఖరి ఘడియ వరకు ప్రజాపక్షం వహించిన హస్రత్‌ మోహాని రాజకీయాలకు దూరం కాలేదు. సాహిత్య రంగాన్ని వదాలలేదు. వందలాది గజల్స్‌ రాసిన హస్రత్‌ మోహాని ఆనాటిప్రముఖ కవులలో ఒకరుగా వెలుగొందారు. ఆయన గజల్స్‌ చలన చిత్రాలలో కూడ చోటుచేసుకున్నాయి.

స్వాతంత్య్ర సంగ్రామంలో మాత్రమేకాకుండ స్వతంత్ర భారతావనిలో కూడా తాను నమ్మిన సిద్ధాంతాలను, తాను ఏర్పర్చుకున్న బాటను వీడకుండా, యోధాను యోదులను కూడ తన విద్వత్తుతో నిర్భయంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిన విప్లవకారుడు మøలానా హస్రత్‌ మోహాని లక్నోలో 1951లో మే 13న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌