పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

145

64. షఫాతున్నీసా బీబి

(1896-1948)

స్వలాభం ఏమాత్రం ఆశించక స్వాతంత్య్రోద్యమంలో చేసిన అద్వితీయ త్యాగాలు మతం ముద్రవలన మరుగునపడి బలవంతంగా స్వంత గడ్డను విడిచి పెట్టాల్సి వచ్చిన భయంకర చేదు అనుభవాలను చవిచూసిన మహిళాయోదురాలు షఫాతున్నీసా బీబి.

1896లో పంజాబ్‌లోని లూధియానాలో షపాతున్నీసా జన్మించారు. తండ్రి మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ నక్షాబంది. చిన్ననాటనే ఆమె ధార్మిక విద్యతోపాటుగా లౌకిక విద్యను మౌలానా హఫీజు ర్రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు.

బ్రిటిష్‌ ప్రభుర్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో అత్యంత కీలక పాత్ర నిర్వహించిన మౌలానా మీద పోలీసులు కక్షగట్టడంతో ఆయన పది సంవత్సరాల ఆరు నెలల పాటు పలు జెళ్ళ ల్లో గడిపారు. ఆ అవిశ్రాంత ఉద్యమకారుని భార్యగా షపాతున్నీసా బీబి కూడా జాతీయోద్యమంలో తనదైన సాహసోపేత పాత్రను నిర్వహించి చరిత్ర పుటలకెక్కారు. భర్త మాత్రమే కాక ఆమె కుమారులు కూడ స్వాతంత్య్ర సంగ్రామంలో భాగస్వాములు కావడంతో అజ్ఞాతం, అరెస్టులు, జైళ్ళలో గడపటం మూలంగా ఆ కుటుంబం దుర్భరమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. అలవిగాని ఆర్థిక కడగండ్లను ఎదుర్కొంటున్నా, ఎవ్వరి వద్ద చేయిచాచి సహాయం అడగని ఆమె తనవద్దనున్నకొద్దిపాి

చిరస్మరణీయులు