పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

ఆర్థికవనరులతో జాతీయోద్యమంలో పాల్గొంటున్న ఇతర ఉద్యమకారుల కుటుంబాల మహిళలను ఆదుకున్నారు. ఉద్యమకారుల కుటుంబాల వివరాలు తెలుసుకుని వారికి ఆర్థికంగా అండదండలు అందించటమేకాక ఆ కుటుంబాల మహిళలను స్వయంగా కలసి ధైర్యం చెప్పటం విశేషం.

ఖద్దరు ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలలో ప్రదానంగా మహిళలలో ఖద్దరు ధారణను ఆమె ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె కుటుంబ సభ్యులంతా ఖద్దరు ధరించారు. భర్తతోపాటుగా ఆమె జమాఅత్‌ ఉలేమా-యే-హింద్‌, (Jamiatul Ulema- e-Hind), భారత జాతీయ కాంగ్రెస్‌లలో సబ్యత్వం స్వీకరించారు. ఆయా సంస్థల పిలుపు మేరకు జరిగిన కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం అందించారు.ఈ క్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షం గా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న షఫాతున్నీసా బేగం పలుమార్లు ఒంటరిగా పోలీసుల భయానక చిత్రహింసలను ధైర్యం-సహనంతో ఎదుర్కొన్నారు.

1947 నాికి సfiరాజ్యం సిదించే రాజకీయ వాతావరణం ఏర్పడింది. అఖిల భారత ముస్లిం లీగ్ భారత విభజన కోరడంతో షపాతున్నీసా దంపతులు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. చివరకు విభజన తప్పలేదు. తమ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇండియా విభజనకు గురికావడంతో విభజన కల్లోలం తాకిడితోపాటు, మతవిద్వేష పెనుతుఫానులో ఆమె కుటుంబం సర్వస్వం కోల్పోయింది. తల దాచుకునేందుకు మొండిగోడల ఇల్లు కూడా నిలువలేదు. నిలువనీడ లేకున్నా, తిండి కరువైనా పర్వాలేదనుకున్నా, విభజనకు వ్యతిరేకులైన ఆ కుటుంబీకుల ప్రాణాలకు విభజనవాదుల నుండి ముప్పు ఏర్పడింది.

ఆ విపత్కర సమయంలో లూధియానా వదలి వెళ్ళమని మిత్రులు సలహా ఇచ్చారు. పుట్టిపెరిగిన గడ్డను, తన ఇంటిని వదలి వెళ్ళడం సుతరాము ఇష్టంలేని ఆమె ప్రాణాలు పోయినా లూథియానా వదిలేది లేదన్నారు. చివరకు తప్పనిసరి పరిస్థితు లలో ఆ దంపతు లు శరణార్థుల శిబిరంలో తలదాచుకుని ఆ తరువాత ఢిల్లీ చేరారు. అక్కడ కూడా దుర్భర పరిస్థితి ఎదురుకావడంతో మళ్ళీ శరణార్థి శిబిరం చేరక తప్పలేదు. అప్పుడు పాకిస్థాన్‌ వెళ్లమని కొందరిచ్చిన సలహాను తిరస్కరించిన ఆమె లూథియానాలోని తన స్వంత ఇంటికి ఎలాగైనా వెళ్ళాలని చివరి వరకు పరితపంచారు, పట్టుబట్టారు. అయితే విభజన వాదం సృష్టించిన అరాచక వాతావరణంలో స్వగృహానికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. చివరకు లూథియానాలోని స్వంత ఇంటిగడప తొక్కకుండానే షఫాతున్నీసా బీబి 1948 న్‌ 1న ఢిల్లీలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌