పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

139

61. యం. అబ్దుల్‌ రహిమాన్‌

(1898-1945)

భారత స్వాతంత్య్రసంగ్రామంలో కలకలం సృస్టించిన మలబారు మోప్లాల చారత్రిక తిరుగుబాటు వారసత్వాన్ని అణువణువునా నింపుకొని బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల బాటన సాగిన మలబారు యోధులలో ఒకరు ముహమ్మద్‌ అబ్దుల్‌ రహిమాన్‌.

1898 లో కరళ రాష్ట్రంలోని కనంగనగర్‌ సమీపాన గల అజికోడ్‌ (AZHIKODE)లో జన్మించారు. ఆ సమయంలో మలబారు మోప్లా జనసముదాయం ఒకవైపు భూస్వాములైన జెన్మిలతో మరోకవైపు వలస పాలకులైన బ్రిటిషర్లతో పోరాడుతున్నారు. ఈ పోరాటాల ప్రభావం నుంచి తప్పించుకోలేని అబ్దుల్‌ రహిమాన్‌ స్వతంత్ర భావనలను,బ్రిటిష్‌ వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్నారు.ఆయన గాంధీజీ సిద్దాంతాల పట్ల బాగా అకర్షితులయ్యారు. ఉన్నత చదువుల కోసం అలీఘర్‌ వెళ్లిన ఆయన గాంధీజీ పిలుపు మేరకు ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనడానికి కళాశాలను వదలి 1920లో స్వస్థలం చేరుకున్నారు.

ఆ సమయాన కేరళ రాష్ట్రంలోని మలబారు ప్రాంతంలో మోప్లా ప్రజానీకం బ్రిటిష్‌ బలగాల మీద తిరగబడి వీరోచిత పోరాటాలు సాగిస్తున్నారు. బ్రిటిష్‌ సైనిక బలగాల క్రూరత్వం వలన, జాతీయ కాంగ్రెస్‌ వ్యవహార సరళి వలన మోప్లా ప్రజానీకం

చిరస్మ రణయులు