పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

127

55. బేగం ఆలం

(-)

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న మహిళలు తమ భర్తలతోపాటు తామూ జైళ్ళ కు వెళ్ళడమే కాకుండా ఏదేని కారణంగా తమ భర్తలు జైళ్ళకు వెళ్ళకపోవడాన్ని అవమానం గా పరిగణంచారు. ఆ విధంగా భావించి భర్తను జాతీయోద్యమానికి అంకితం చేయ డంలో ఏమాత్రం వెనుకాడని మహిళామణులలో బేగం ముహమ్మద్‌ ఆలం ఒకరు.

ఆమె లాహోర్‌కు చెందిన ఖాన్‌ షేక్‌ మియా ఫరోజుద్దీన్‌ కుమార్తె. ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు డాక్టర్‌ ముహమ్మద్‌ ఆలం భార్య. అసలు పేరు కంటే బేగం ముహమ్మద్‌ ఆలం పేరుతో ఆమె ఎంతో ప్రఖ్యాతి చెందారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమం సందర్బంగా కనకవర్షం కురిపిస్తున్న న్యాయవాదవృత్తిని త్యజించిన డాక్టర్‌ ఆలంతోపాటు బేగం ఆలం కూడా జాతీయోద్యమంలో ప్రవేశించారు.

1932లో అనారోగ్యంతో బాధాపడుతున్న డాక్టర్‌ ఆలంను బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. జైలులో వైద్యసదుపాయం అందక డాక్టర్‌ ఆలం ఆరోగ్యం మరింత చెడింది. డాక్టర్‌ ఆలం గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని స్వయంగా విజ్ఞప్తి చేస్తే తప్ప వైద్య సౌకర్యం కల్పించేది లేదని అధికారులు ఖరాఖండిగా చెప్పారు. డాక్టర్‌ ఆలం మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ప్రభుత్వానికి వినతిపత్రం

చిరస్మరణీయులు