పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

119

51. డా. ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి

(1880-1936)

బిన్నజనసముదాయాల నిలయమైన భారతావనిలో ఆ సమూహాల ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే స్వరాజ్యం సిద్దిమ్చగలదని విశ్వసించి, హిందూ-ముస్లింల ఐక్యత కోసం ఆవిశ్రాంతంగా కృషిసల్పిన ప్రముఖులలో అగ్రగామి ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజీపూర్‌ జిల్లా, యూసుఫ్‌పూరాలో 1880 డిసెంబర్‌ 25న జమీందారి కుటుంబంలో ఆయన జన్మించారు. హాజీ అబ్దుర్రహ్మాన్‌, ఇల్లహన్‌ బీబిల కుమారుడైన అన్సారి 1900లో నిజాం కళాశాల నుండి డిగ్రీ తీసుకుని హైదారాబాద్‌ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఉపకారవేతనంతో ఇంగ్లాండ్‌ వెళ్ళారు. 1908లో శస్త్రచికిత్సా విభాగం నుండి మాస్టర్‌ డిగ్రీ తీసుకుని అక్కడే ప్రతిష్టాత్మ కమైన పలు సంస్థలలో పనిచేశారు. 1910లో స్వదేశం వచ్చి మంచి వెద్యునిగా ఖ్యాతి గడంచిన ఆయన బాగా సంపాదించారు. సంపన్నుల డాక్టర్‌గా పేర్గాంచిన ఆయన ప్రతిరోజు ప్రత్యేక సమయాలలో పేదవర్గాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించటం ద్వారా సామాన్య ప్రజల మన్నన పొందారు. 1916 ప్రాంతంలో Home Rule ఉద్యమంతో ఆరంభమైన అన్సారి రాజకీయ జీవితం జాతీయ కాంగ్రెస్‌ సబ్యత్వంస్వీకరించటంతో వేగాన్ంబందుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌, ముసిం లీగ్ ల మధ్య లక్నో ఒప్పందం కుదారటంలో విశేషమైన పాత్ర వహించిన

చిరస్మరణీయులు