Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

భూరిమధుపానమునఁ జొక్కి పుష్పరేణు
పటలి భూతిగఁ దాల్చి నేర్పరితనమున
ఝంకృతులు శృంగనాదంబుజాడ గాఁగఁ
దుమ్మెదలపిండు మించె సిద్ధులవిధమున.

107


క.

వెన్నెలతళుకును మించిన
వెన్నెల బిసకాండములు ప్రవీణతతోడన్
గ్రొన్నెలఁ దగు రాయంచల
గున్నలు జవరాండ్ర కిచ్చెఁ గోరికతోడన్.

108


చ.

మలయము నేలి పద్మినుల మంజులసౌరభ మెల్లఁ గ్రోలి పు
వ్వులఁ గనుపట్టు మేలితనువు ల్ముద మందఁగ వ్రాలి కైతకం
బులఁ బొడకట్టుధూళి దివి బోవఁగఁ ద్రోలి మృదుత్వశీలియై
కలయఁ జరించెఁ జల్లనగుగాలి పదాను[1]పదన్మదాలియై.

109


వ.

ఇట్లు సమస్తమహీరుహంబులకు సంతసం బొసంగు వసంత
సమయంబున ననంతధ్యానపరాయణుడై హృదయస్థిత
నారాయణుండును నిర్మలప్రచారుండును నిర్వికారుండును
నగు తుల్యుం డుగ్రతపంబుఁ సేయుచుండె నంత.

110


సీ.

చెలువైన చిల్కతేజీమీఁద నొసపరి
             కెందమ్మిపక్కెరఁ బొందుపఱిచి
క్రొత్తదాసనపుఱేకులు గీలుకొల్పిన
             బిరుదైన దగులాల సరియొనర్చి
కురువేరు నెరులచిక్కులు దిద్ది సవరించి
             కట్టిన [2]సరివెలికట్లు వైచి
నవకింశుకప్రసూనదళంబు సరి లేని
             యరిగఁ బ్రియంబున నవధరించి

  1. సరస్మదాలియై
  2. వెలిసమకట్లు