Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పూరపరిపూరితాశానభోధరిత్రి
గాఁగ వానలు గురిసె లోకములు [1]బెదర.

22


వ.

అప్పుడు.

23


తే.

పరమహంస యనంగఁ దాఁ బరఁగి యమృత
దేహియై మంగళాకృతిఁ దేరి బుధతఁ
జెంది విజ్ఞానగురుఁడు నాఁ జెలఁగి యతఁడు
పర్వతభృగుస్థలమునఁ దపంబు సలిపె.

24


వ.

మఱియును.

25


క.

తొరలెడువానలఁ దడియుచు
గిరిచఱిఁ గూర్చుండి యోగికేసరి దినముల్
మరుదశనంబునఁ గడపుచుఁ
జిరకాలం బుగ్రతపముఁ జేయుచు నుండెన్.

26


వ.

అంత.

27


తే.

ఎలమి మేలైనవర్షంబు లెల్లజాఱ
స్వాంతమునఁ దూలి గద్గదస్వరము గదురఁ
దుదిశరత్తులఁ బొదివి వృద్ధులవిధమున
నరిగె నెందేని మేఘంబు లాకసమున.

28


క.

జలదములముంపు దప్పినఁ
గలితప్రభఁ బొల్చె దిశలు గర్దమ మింకెన్
జలి యంతంతకుఁ మించెం
గొలఁది తఱిగి నదములెల్లఁ గొంచెము లయ్యెన్.

29


క.

కమలారు లైన హేమం
తముఁ దద్రాత్రిచయమును ఘనములై తోఁచెన్

  1. చెదర