Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

మృగరాజులు నానావిధ
మృగరాజులు [1]హరులు కరులు మెలఁగక డాఁగెన్.

⁠ 8


చ.⁠

మిటమిటఁ గాయు నాతపము మించఁగ నోర్వక గండశైలముల్
పెటపెట ప్రేలి పేలములపెంపు వహించెను జీవకోటులున్
బొటబొటఁ బొక్కె భూమిగల భూజములందు మహోగ్రవృత్తిమైఁ
జిటచిట నిప్పు లుప్పతిలెఁ జెప్పఁగరాని నిదాఘవేళలన్.

⁠ 9


వ.⁠

అట్టి సమయంబున.

⁠ 10


మ.⁠

గురుబాహాయుగ మెత్తి వామచరణాంగుష్ఠంబునన్ భూమిఁ ద్రొ
క్కి రమావల్లభు నాత్మలో నునిచి వీక్షింపంగ రానట్టి భా
స్కరుపైఁ జూపులు నిల్పి తుల్యుఁడు సమగ్రబ్రహ్మనిష్ఠారతిన్
బరమాశ్చర్యముగాఁ దపంబు సలిపె న్బంచాగ్నిమధ్యంబునన్.

⁠ 11


వ.⁠

అంత.

⁠ 12


క.⁠

జీమూతాక్రాంతంబగు
భూమండల [2]మనఁగ నానభోమండలమున్
జీమూతాక్రాంతముగా
జీమూతాగమము దోఁచెఁ జిత్తం బలరన్.

⁠ 13


చ.⁠

అనిమిషనాథుఁ డమ్మునితపోనలకీలల నబ్ధి యింకినన్
దనకు విపక్షుఁడై యచట దాఁగిన యాహిమవన్నగాత్మజున్
గినిసి విపక్షుఁ జేయఁ గమకించి ప్రచేతసునింట నిర్గమం
బనిచెడువి ల్లనంగ సపరాశసురేశ్వరుచాప మొప్పెఁ దాన్.

⁠ 14
  1. ↑ సిరుల హరుల
  2. ↑ మున్ స్ఫురన్నభోమండలమున్