Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అఱిముఱి సారథితోడన్
ముఱియుపడగతోడ హయసమూహముతోడన్
జిఱజిఱను ద్రిప్పి యరదము
పఱపఱిగాఁ గొట్టి భీముఁ బైకొని కినుకన్.

22


క.

ముసలమున వ్రేయ నాతం
డసమున గేడించి దాఁటి హలధరువక్షం
బసరొత్తఁగ గదచేఁ గొ
ట్టె సురలు గనుఁగొని తనమగఁటిమి నుతియింపన్.

23


శా.

ఆలో భీమునిపైఁ బురత్రితయసంహారంబు గావించు న
ప్ఫాలాక్షుం డన నేగి మాధవుఁడు శుంభల్లీలఁ దద్బాహులన్
గీలించెన్ బదునాల్గుతూపు లది వీక్షిం చర్జునుం డాహరిం
దూలించెన్ విశిఖంబులన్ సురలు సంతోషించి భూషింపఁగన్.

24


క.

హరి యంతట కోపంబున
నరునియురం బాడనేసె నారాచములతో
శర మొకటి గ్రుచ్చె నొసటను
గరవాలున బలుఁడు గొట్టి కడువడి నార్చెన్.

25


వ.

ఆసమయంబున.

26


చ.

అవనీమండల మెల్ల గ్రక్కదల బ్రహ్మాండంబు భేదిల్ల వా
సవి రోషంబున రామకృష్ణులపయిన్ సమ్మోహనాస్త్రంబు మం
త్రవిధి మౌర్వి నమర్చి యేయుటయు మూర్ఛం బొంది రద్ధారకుం
డు వడిన్ వారలఁ గొంచు [1]సత్యకసుతుండుం దోడ నేతేరఁగన్.

27
  1. సత్యసుతుఁడుం దోడ్తోడ నేతేరఁగన్.