Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెనఁగెద రింద్రుఁడున్ విధుఁడుఁ బేర్చిన నావచనంబు తప్పునే.

134


సీ.

నీలాంబరుఁడు నవ్వె గేలిఁ బెట్టె గదుండు
             కృతవర్మ కన్నులు గీటె సాంబుఁ
డల్లన తలయూఁచె నసమబాణుఁడు భుజం
             బప్పళించెను [1]జేతులార్చె నుగ్ర
సేనుండు చేవైచెఁ జేకితానునిపైని
             ననిరుద్ధుఁ డక్రూరుఁ డదిమె ఋషభుఁ
జారుధేష్ణుండు రోషమునఁ బండ్లు కొఱికె
             సారణుఁ డట్టహాసంబుఁ జేసెఁ


తే.

బెదవి విఱిచెను సాత్యకి మదము మెరసి
చూచె దీప్తిమంతుండు భోజులును యాద
వులును వార్ష్ణేయులును మది నలుక వొడమి
గుజగుజలు పోయి బీరముల్ గొనిరి మిగుల.

135


క.

ఈరీతిఁ జేయ సభ్యులఁ
దేరఁగఁ గని పాండుసుతుఁడు తెలిగన్నుల సాం
ధ్యారాగ మొదవ నుడుగని
వీరత్వము మెఱయ ననియె వినఁ జిత్రముగన్.

136


ఆ.

నెనరు మనసులోన నిలిపి యీ తెఱఁగున
సామభాషణములఁ బ్రేమతోడ
లోకులెల్ల మెచ్చ మీకుఁ జెప్పితిఁ గాక
బలిమి మమ్ము గెలువఁగలరె మీరు.

137
  1. జకురాడె నుగ్ర