Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జనుదోయిగరిమంబు చక్రవాకములందుఁ
             గౌనువిలాస మాకసమునందు
జఘనమండలి యొప్పు సైకతస్థలియందు
             నడుగులపస చివురాకులందు

⁠


తే.⁠

నడలమురిపంబు గజగమనములయందు
మేనిచెలువంబు క్రొక్కారుమెఱుపులందుఁ
బలుకు[1]సుకుమార మెల్ల రాచిలుకలందుఁ
జేరఁ దొలిమేను వదలి యాచిగురుఁబోఁడి.

⁠ 110


సీ.⁠

ప్రియునికెమ్మోవి చుంబింపనోపనిలేమ
             కఠినఖలీన మేగతి వహించు
హారంబు బరు వని యలయు లతాతన్వి
             వాగెల నెట్టికైవడి ధరించు
జడసోఁకు లోర్వఁగాఁ జాలని తరళాక్షి
             కడువంక పల్ల మేకరణిఁ బూను
నొడ్డాణమును దాల్పనోపని సతిపొట్టఁ
             బట్టెడబిగి నెటువలె సహించు

⁠


తే.⁠

మిగులు మెత్తని నడుపుల మెలఁగునింతి
మనసుకంటెను జవమున మసలునెట్టు
లనుచు దేవత లద్భుత మంది చూడ
రాజకులనాథ సాంబ్రాణితేజి యయ్యె.

⁠ 111


వ.⁠

ఇట్లు రంభ తురంగంబై చరించుచుండె నంత.

⁠ 112


ఉ.⁠

కుండినవల్లభుండు రిపుకుంజరసింహపరాక్రముండు దో
ర్దండధృతావనీతలుఁడు దానజితామరభూజచంద్రమా

⁠
  1. ↑ నుడికార