పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

4 /-798 వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని తలచినచో, ఆ ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తికి, 'వ' ధ్రువపత్రమును లేక సందర్భానుసారముగ *[1]"ప్ర" ధ్రువపత్రమును ఈయవలెను మరియు ఆ ఫిల్ముకు విహితరీతిగా అట్లు గుర్తు వేయించవలెను:

అయితే, ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి గాని, ఎవరేని పంపిణీదారుగాని, ప్రదర్శకుడుగాని లేక ఆ ఫిల్ములో హక్కులు సంక్రమించిన మరెవరేని వ్యక్తి గాని, ఖండము (ఏ) లేక ఖండము (బీ) కింద ధ్రువపత్రము పొందిన ఫిల్ము లోని ఏదేని విషయమును గురించిన అశ్లీలతకు సంబంధించిన ఏ శాసనము క్రింద న్నెనను శిక్షకు పాత్రుడు కాడు .

(2) ఏదేని ఫిల్ము విషయములో ఇచ్చిన ధ్రువపత్రమును లేక ధ్రువపత్రము నిచ్చుటకు నిరాకరించుచు చేసిన ఉత్తరువును, భారత రాజపత్రములో ప్రచురించవలెను.

(3) 'ఈ చట్టములోని ఇతర నిబంధనలకు లోబడి, ఈ పరిచ్ఛేదము క్రింద బోర్దు. ఇచ్చిన ధృవపత్రము, పది సంవత్సరముల కాలావదిపాటు భారత దేశమంతటను శాసనమాన్యత కలిగియుండును.

5బీ... (1) ఏదేని ఫిల్ముకు ధ్రువపత్రము నిచ్చుటకు సమర్దతగల ప్రాధికారి అభిప్రాయములో, ఆ ఫిల్ముగాని అందలి ఏదేని భాగముగాని, భారతదేశము యొక్క సార్వభౌమత మరియు - అఖండత , రాజ్య భద్రత, విదేశీ రాజ్యములతో స్నేహ సంబంధములు, మారదర్శక ప్రజాశాంతి, సభ్యత లేక నైతికత-వీటికి సంబంధించిన హితములకు భంగకరమైన , ద్నెనచో, లేక పరువు నష్టము లేక న్యాయస్థాన ధిక్కారము ఇమిడియున్నద్నెనచో, లేక ఏదేని అపరాధము చేయుటను ప్రేరేపించగలదైనచొ, దానిని సార్వజనిక ప్రదర్శనార్దము ధ్రువీకరించరాదు.

(2) ఉపపరిచ్ఛేదము (1)లోని నిబంధనలకు లోబడి, ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయుటలో ఈ చట్టము క్రింద ధ్రువపత్రములనిచ్చుటకు సమర్ద తగల ప్రాధికారి పాటించవలసిన సూత్రములను పొందుపరచుచు కేంద్ర ప్రభుత్వము తాము సబబని తలచునట్టి ఆదేశములను జారీచేయవచ్చును .


5సీ. (1) ఏదేని ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టు కొనియుండి, బోర్దు -

(ఏ) ధ్రువపతము నిచ్చుటకు నిరాకరించుచు; లేక

('బీ) వ' ధ్రువపతమును మాత్రమే ఇచ్చుచు; లేక

(సీ) ప్ర ద్రువపతమును మాత్రమే ఇచ్చుచు , లేక

(డీ) నిలేవ' ధ్రువపతమును మాత్రమే ఇచ్చుచు; లేక

(ఈ) ఏవేని కత్తిరింపులను లేక మార్పులను చేయవలసినదిగా దరఖాస్తు దారును ఆదేశించుచు చేసిన ఉత్తరువు వలన వ్యధితుడెన ఏ వ్యక్తి యైనను అట్టి ఉత్తరువు తేదీ నుండి ముప్పది దినముల లోపల ట్రిబ్యునలుకు అపీలు చేసుకొనవచ్చును:

అయితే, అపీలుదారు, పర్యాప్తమైన కారణమును బట్టి, పైన తెలిపిన ముప్పది దినముల గడువులోపల అపీలు దాఖలు చేయలేకపోయినాడని టిబ్యునలు తృప్తి, చెందినచో ఆ అపీలును మరో ముప్పది దినముల గడువులోపల స్వీకరించుటకు ఆ టిబ్యునలు అనుమతింపవచ్చును.

  1. *ప్రత్యేకం