పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

5/G-799 (2) ఈ పరిచ్ఛేదము క్రింద ప్రతియొక అపీలును వ్రాతమూలకమైన అర్జి ద్వారా చేయవలెను; ఏ ఉత్తరువుపై అపీలు చేయన్నెనదో ఆ ఉత్తరువుకుగల కారణముల సంగ్రహ వివరణను అపీలు దారుకు అందజేసియున్నయెడల అట్టి వివరణ ప్రతిని మరియు ఒక వేయి రూపాయలకు మించకుండ విహితపరచినట్టి ఫీజును అపీలుతో దాఖలు చేయవలెను .

5డీ. (1) పరిచ్ఛేదము 5సీ క్రింద బోర్డు చేసిన ఏదేని ఉత్తరువుపై అపీళ్ళను ఆకర్షించు నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా ఒక అపీలు టిబ్యునలును ఏర్పాటు చేయవలెను.

(2) టిబ్యునలు - ప్రధాన కార్యాలయము న్యూ ఢిల్లీ లోగాని కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నిర్దిష్టపరచు నట్టి ఇతర స్టలములొ గాని ఉండవలెను .

(3) అట్టి టిబ్యునలులో కేంద్ర ప్రభుత్వము నియమించినట్టి ఒక ఛైర్మను" మరియు నలుగురికి మించని ఇతర సభ్యులును ఉండవలెను .

(4) ఉన్నత న్యాయస్టానపు న్యాయాధీశుడుగా పదవీ విరమణ చేసిన వ్యక్తి అయి యుండిననే తప్ప లేక ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుడుగా ఉండుటకు అర్హత కలిగియున్న వ్యక్తి అయిననే తప్ప ఏ వ్యక్తి యు , టిబ్యునలు చెర్మనుగా నియామకమునకు అర్హుడు కాడు.

(5) ఫిల్మువలన ప్రజలపై, పడగల ప్రభావమును నిర్ణయించుటకు అర్హతగల వారని తాము అభిప్రాయపడు నట్టి వ్యక్తులను కేంద్ర ప్రభుత్వము టిబ్యునలు సభ్యులుగా నియమించవచ్చును .

(6) టిబ్యునలు. చైర్మను, కేంద్ర ప్రభుత్వము నిర్దారణ చేయునట్టి జీతము లను, మరియు - బత్తెములను పొందవలెను. మరియు సభ్యులు, విహితపరచబడునట్టి బత్తెమునుగాని ఫీజునుగాని పొందవలెను

(7) ఈ విషయమున చేయు నియమములకు లోబడి, కేంద్ర ప్రభుత్వము ఒక కార్యదర్శిని మరియు ఈ చట్టము క్రింద టిబ్యునలు కర్తవ్యములను సమర్ద వంతముగా నిర్వర్తించుటకొరకు ఆవశ్యకమని తాము తలంచునట్టి ఇతర ఉద్యోగులను నియమించవచ్చును .

(8) టిబ్యునలు కార్యదర్శి మరియు ఇతర ఉద్యోగులు, టిబ్యునలు ఛైర్మనుతో సంప్రదించిన పిమ్మట, విహితపరచినట్టి అధికారములను వినియోగించవలెను మరియు అట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను . (9) టిబ్యునలు ఛైర్మను మరియు సభ్యులయొక్కయు, కార్యదర్శి మరియు ఇతర ఉద్వోగులయొక్కయు సేవను గూర్చిన ఇతర నిబంధనలు మరియు షరతులు, విహితపరచునట్టి వైయుండును.

(10) ఈ చట్టపు నిబంధనలకు లోబడి, టిబ్యునలు తన ప్రక్రియను తానే క్రమబద్దము చేసుకొనవచ్చును .

(11) టిబ్యునలు ఏదేని ఫిల్ముకు సంబంధించి, ఆ విషయములో తాము ఆవశ్యకమని తలచు నట్టి: పరిశీలన జరిపిన పిమ్మటను, ఆ విషయములో ఆకర్షించబడు' టకు అపీలు దారుకు మరియు బోర్డు కు ఒక అవకాశమునిచ్చిన పిమ్మటను తాము సబబని తలచునట్టి ఉత్తరువును చేయవచ్చును; బోర్డు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను; .