Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్చినతరిసిల్పు[1]దండలును జే సణుజు ల్గలడేగవేఁటరుల్
గునుకుచు రాజుమ్రోల సెలగోలలు గైకొని వచ్చి రుబ్బునన్.

23


ఉ.

జాతర పుట్టచెండు నెఱజాణ గయాళి కరాళి దిట్ట చిం
బోతు తుపాకి జోగి సుకబోగి తుటారి తలారి మారి సం
గాతి లకోరికోల యనఁగాఁ జనుకుక్కలఁ గేలఁ బూని య
త్యాతతశృంఖలాఘలఘలార్భటి మించఁగ వచ్చి యుద్ధతిన్.

24


సీ.

బోటుమాటలు గావు పొదరొప్పుసింగంపుఁగొదమనైనను గూలఁగ్రుమ్మఁగలము
వట్టిమాటలు గావు పుట్టకూటికి డాయు నెలుఁగునైనను బట్టి నిలుపఁగలము
పెక్కుమాటలు గావు గ్రక్కునఁ బైకొన్న పులినైనఁ జే యిచ్చి పొడువఁగలము
రిత్తమాటలు గావు హత్తికొమ్మునఁ జిమ్ముకిటి నైనఁ జొరఁబాఱి కెడపఁగలము
వదరుమాటలు గావు దేవరపొలానఁ, గలుగుపులుఁగుల నన్నింటిఁ బిలువఁగలము
చిత్తగింపును మ మ్మని సెలసువిండ్లుఁ, బలుకగొడ్డండ్లుఁ గలబోయపౌఁజు గొలువ.

25


క.

రయలటహపటహఢక్కా, జయకాహళభేరిపణవశంఖహుడుక్కా
భయదార్భటి దెస లద్రువం, బయనం బయి యేగి చంద్రభానుం [2]డంతన్.

26


సీ.

ప్రబలగంధావేశభద్రభేదిమృగేశమసృణకేసరమంజుమంజరితము
కుపితోగ్రచిత్రాంగఘోషభీతకురంగపటల[3]చారుకుడుంగపంజరితము
ఘనఘనాఘనలీలగాఢకాంతిస్థూలకుధరశిలాజాలకుంజరితము
దంష్టిదంష్ట్రాభోగదళితపృథ్వీభాగపృథువిచిత్రపరాగపింజరితము
చటులఝంఝూప్రభంజనజవవికీర్ణ, [4]శాల్మలీకుజపుంజసంజాతతూల
[5]చక్రపలితపరీణాహసంజరితము, నైన వార్ధితటారణ్య మచటఁ గాంచె.

27


క.

కాంచి యలయటవిఁ జొచ్చిన, చెంచులు మునుగలుగ నచటు సేరి నలుగడం
బొంచీ వెలివెడలుకడ లూ, హించి మృగౌఘముల నిగ్రహించుకడంకన్.

28


గీ.

దుష్టమృగచయంబుఁ దూలించి వనసీమ, నాత్మవశము సేయ నాటవికులు
చుట్టుతోరణంబు గట్టినచందానఁ, బ్రమద మొదవఁ బ్రోవువారి రపుడు.

29


క.

తమగజముల నచ్చటిసిం, గము లారడిపెట్టు ననుచుఁ గలుషించి విశా
సముదయము వనముఁ జుట్టిన, క్రమమునఁ దెర లడరె లుబ్ధకనిబద్ధము లై.

30
  1. గుండులు
  2. చ-ట-ఎదుటన్
  3. క-చార
  4. క-శాల్మలీకుజాత
  5. చ-చక్రపరిచితసరిణాహ