Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]ఉ.

ఏమని చెప్పవచ్చు జగతీశ్వర యీశ్వరుఁడే యెఱుంగు న
య్యామనిఁ బంటచేల [2]డిగి హావళి సేయు మహామహీజముల్
భీమనిశాతదంష్ట్రికల బిట్టగలించుచు నేకలంబు లా
హా మనవచ్చునే యవి మహారభటిన్ సెలకొట్టి రొప్పినన్.

8


క.

మిలమిలనిగోళ్లఁ జిలుపలు, గులగులలుగఁ గొట్టునచటిక్రోల్పులు గవిం
బొలవొలయ నెఱిఁగి యెఱుకులు, పులి పులి యన్నపుడ కవిసి పులిపులి సేయున్.

9


ఉ.

త్రెళ్లవు వాఁడిడొంకెనలఁ దీఱవు చిల్కులకోరికోలలన్
డొల్లవు బల్లకోలల ముడుఁగవు మేటికటారిపోటులం
జెల్లవు చిప్పకత్తుల నశింపవు వ్రేఁకవుబాఁకుతాఁకులన్
భల్లము లచ్చటన్ హృదయభల్లము లై తగు భిల్లకోటికిన్.

10


[3]క.

తఱిమి పయి నంటుకుక్కలఁ, గఱచు న్వడిఁ దిరిగి యెమురుగవిసినకుందే
ళ్లఱిముఱి నే మని చెప్పుదు, నెఱి నెఱియల నూఱునాఱు నెలవై యుండున్.

11


గీ.

చేత డేగఁ బట్టి సెలకట్టె గైకొని, ప్రొద్దుపోక పొలము వోయెనేని
దినము వలసినన్ని తేవచ్చుఁ బులుఁగుల, వానితఱచుఁ జెప్ప వశమె నాకు.

12


సీ.

మోటుదప్పకయుండ మూఁక నిల్పినఁ జాలుఁ బలుతీవియలె యురు ల్పన్నగలవు
తెరువులఁ గుక్కల నిరవు కొల్పినఁ జాలు నెఱులె యోదంబులై నిలుపఁగలవు
చెంతల దీము లుంచినఁ జాలు సుడిగాలి నెగయుదుమ్ములె తెర లెత్తగలవు
మొనసి మాఱమ్ము లొడ్డినఁ జాలు నెండమావులె పోతనీరులై మలయఁగలవు
చో పిడినఁ జాలుఁగా రగ్గి సోఁకి కనలి, మిగులుకొయ్యలె వసులయి మించఁగలవు
నీవు వచ్చినఁ జాలు ధాత్రీవరేంద్ర, వేఁట తనుదానె వేఁటఁ గావింపఁగలదు.

13

చంద్రభానుఁడు వేఁట కేగుట

క.

అన వాని నరిదియొసఁగుల, ననిపి గృహంబునకు వచ్చి హరికి మృగయపై
ననురక్తిఁ దెలిపి యాతని, యనుమతిఁ బ్రియసఖునిఁ గూడి యధికోత్కంఠన్.

14


సీ.

సవరని కెంబట్టుచల్లడంబు ధరించి గట్టిగాఁ [4]బైసూపుదట్టి గట్టి
సరిగెక్రొంబనికందుసాలెయంగియఁ బూని చలువచెంగావిపచ్చడము గప్పి
జిలిబిలిజల్లుపచ్చలప్రోఁగులు వహించి కమ్మఁగస్తురిఁ దిలకమ్ము దీర్చి
కుడివంకఁ బవడంపుఁబిడివంకి సవరించి యఱుతఁ గెంపులతాళి యలవరించి

  1. ఈపద్యము ట-లో లేదు.
  2. చ-ఁబడియావళి
  3. ఇది ట-లో లేదు
  4. క-బైనపుదట్టి