Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భోరుహనేత్ర లెత్తుతెలిముత్తెపుటారతిపళ్లెరంబు లై
చారుతదీయహేమకలశంబులు దీపము[1] లై వెలుంగఁగన్.

22


ఉ.

వేంకటభూవరుం జెనకువీరులు తూఱఁగనైన గంటితోఁ
బంకరుహాప్తబింబము విభాసిలు నాజి నసృగ్ఝరంబులన్
సంకులవృత్తిఁ దద్వరణసంభ్రమసంభ్రమదాదితేయతా
టంకవతీపదాంబుజహఠచ్యుతనూపురరాజమో యనన్.

23


క.

ఆవేంకటపతినృపతి ద, యావీక్షాగౌరవమున నతిశాశ్వతల
క్ష్మీవైభవంబుఁ గాంచిన, నావంశం బభినుతింతు నవమధురోక్తిన్.

24


శా.

శ్రీవిద్యావిభవాస్పదం బయిన యార్వేలాన్యవాయంబునం
బావిత్ర్యాభినుతస్వతంత్రకపిసన్మౌనీంద్రగోత్రుల్ ధరా
దేవోత్తంసులు మించి రందు బెడఁగొందెన్ భూజనశ్రేణి సం
భావింపం దరిగొప్పులాంకుఁ డగు శ్రీమల్లప్రధానుం డిలన్.

25


చ.

విముఖతఁ బూను మిత్రునెడ వే ఘనులం గని డాఁగు శుద్ధప
క్షమున వసుచ్ఛట ల్విడువఁజాలఁడు సారెఁ బ్రకాశితాంశుఁడై
తమి వెలయించుఁ గాని తనుదానమునం గడుఁ గుందు నేగతిం
గుముదహితుండు సాటి తరిగొప్పుల మల్లనమంత్రి కీగులన్.

26


[2]క.

ఆతరిగొప్పుల మల్లసు, ధీతిలకుఁడు గాంచె నరసధీనిధి నతిఖ
ద్యోతద్యుతి నతులితవి, ద్యాతతి నతిసుకృతి నాగమాంబికయందున్.

27


సీ.

తననిశాతకృపాణియును బాణియును బతిశ్లాఘాధురానిరాసము ఘటింపఁ
దనకరుణాసారమును సారమును నరిశాసనస్మయవివాసనము చలువఁ
దనసద్గుణనికాయమును గాయమును సుధాకిరణవిస్ఫురణ ధిక్కృతి యొనర్పఁ
దనమనీషాభోగమును భోగమును సుధాంథఃప్రధానావధూననము దెలుపఁ
దసప్రభావంబు భావంబు ధర ననంత
ధృతి సమాసాదనంబునఁ దేజరిల్ల
వఱలు నాశ్రితబాంధవాననపరుండు
మంత్రిమాత్రుండె నరసయామాత్యవరుఁడు.

28


చ.

చతురాస్యాననపాళిక న్మెలఁగు నంచత్పాండుపద్మాసన
స్థితి దీపించు వినిర్మలాంబరరుచిశ్రీ మించు హంసాళి న

  1. చ-దీవియ
  2. ఇది మొదలు "యాదవాగ్రజు” ననుపద్యమువఱకు ట-ప్రతిలో లేదు.