Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యిం దొకటియైనఁ గానరాదేమొ కాని
పూనుకొని మేలు దెల్పెడు వీనితెఱఁగు
లనుచుఁ దనుఁ జూచి ముదిమంత్రు లాడుకొనఁగఁ
దనరుకక్ష్యాంతరంబుల దాఁటి యేగి.

125

కృష్ణుఁడు చంద్రభానున కెదురుచనుట

ఉ.

కమలదళాయతాక్షుసముఖంబునకుం జని మ్రోల విన్నప
త్రము లిడఁ దక్కుమారలిఖితస్వశుభోత్తరవాచికంబులం
బ్రమదము గాంచి వానికి నపారధనంబు లొసంగి యారమా
రమణుఁడు పుత్రదర్శనపరత్వర నప్పుడు తేజి నెక్కినన్.

126


సీ.

విడిగాల శౌరితత్తడివెన్క నేతెంచె నగతులఁ జేఁబూని చారుచంద్రుఁ
డందంబు గాఁగ నైదాఱుగుఱ్ఱములతోఁ గదలె వేగమున సంకర్షణుండు
వడిఁ దెమ్ము తెమ్మని యడిదముఁ గైకొని పరువున నరిగె జాంబవతిపట్టి
పడివాగె హరిమ్రోలఁ బట్టి కీరపఠాణి నెక్కి ముంగల నేగెఁ జక్కనయ్య
వెలుపటిహజారముస నుండి వెలినె వెలినె, చేత బెత్తంబుఁ గైకొని సేన నెల్ల
వెడలు మని చెప్పి పంపుచు వెన్నునెదుట, హరిగెనీడల నడచె [1]గదానుజుండు.

127


మ.

హరి యిట్లేగినమాట వింట తడ వాత్మావాసము ల్వెల్వడం
ద్వరసామ్రాణుల సాదు లడ్డముగఁ ద్రోవం బట్టి రా నెక్కి యొం
డొరుల న్మీఱ హుటాహుటిం గదలి రత్యుత్కంఠ నల్లుండ్రు సో
దరులుం బుత్రులు చేర నచ్యుతుని గోత్రాపాంసువు ల్గ్రమ్మఁగన్.

128


[2]సీ.

ఎదురైనవారల నేత్రోవ హరి యేగె నని సారె కడుగుచు నరుగువారు
గ్రక్కున వీథులఁ గన్గొని కొలువు మ్రొక్కులు మ్రొక్కి వెనువెంట [3]వెలలువారుఁ
దమవారిఁ బొడఁగన్న దట్టికైదువులు గైకొని తెమ్మనుచుఁ గూడఁ [4]జనెడువారు
రా జేగెనేమొ రారా నీవు రమ్మని యొండొరుఁ బిలుచుచు నుఱుకువారుఁ
ద్రాళ్లు వైవక దంతులఁ దఱుమువారు, సిడెము లెత్తక రథములు నడపువారుఁ
బల్లణింపక హయములఁ బఱపువారు, నైనబలములు తోఁకచా లగుచుఁ గదలి.

129


క.

చనఁ జన నటఁ దోడ్తో వెను, కొని [5]కోట్లుం గొండ లగుచుఁ గూడుచు నడచెన్
వనమాలివెంట వాద్య, ధ్వనిఁ గులశైలములు వడఁక ధర యూటాడన్.

130
  1. చ-బలానుజుండు
  2. ట-లో నీపద్యమును దీని క్రిందిపద్యమును లేవు.
  3. చ-కూడువారు
  4. చ-గునుకువారు
  5. చ-కోటులు కొండ లనుచు