Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దరుల విచ్చిన కపురంపుఁదరుల పొరల, నురలు గంబూరములు గాలికుప్పరంబు
లెగయఁదగు నేర్లు తమనీటి కగుకలంక, లడఁచుమౌనికి నుడుగర లనిపె ననఁగ.

8


చ.

అలయతిమాత్రవృష్టిసమయంబున నెప్పటియట్ల ధాత్రిపైఁ
గలయఁగఁ బర్వలేక శశికాంతి సభస్స్థలియందపేరి యా
జలదపువేళ రూపఱిన స్వచ్ఛతనుచ్చట గాననయ్యె నా
నలరె శరద్ఘనంబులు సితాంబుజపారదనారదచ్ఛవిన్.


ఉ.

బాహుల మీగతిన్ ధరణిభాగమున న్నెఱిఁ జూపుచుండ వై
వాహికలగ్నయోగ్యశుభవాసరము ల్చనుదెంచిన న్మహో
త్సాహముతోడఁ జైద్యవసుధాపతి యాత్మకుమారమౌళి కు
ద్వాహము సేయఁ బూనిక ముదంబు హృదంబుజసీమఁ దోఁపఁగన్.

10


[1]గీ.

ఆప్తవర్గంబుతో రహస్యంబు గాఁగఁ, గొంతసేపు విచారించి కుండినమున
రుక్మబాహుప్రభునిపుత్రి రుక్మగాత్రి, కుముదినీకన్య యునికి భావమునఁ దెలిసి.

11


చ.

తమకుఁ బురోహితుఁ డగుపితామహసన్నిభు గాలవాఖ్యసం
యమిఁ గదియంగఁ బిల్చి విమలాత్మ విదర్భధరిత్రి కేగి సం
భ్రమమున రుక్మబాహునరపాలశిఖామణిపుత్రి యైనయా
కుముదిని ధృష్టకేతువునకుం దగ వేఁడుము పొమ్ము గొబ్బునన్.

12


చ.

అనవుడు నట్లకాక యని యమ్ముని కుండినరాజధానికిం
జని తనరాక భీమనృపచంద్రతనూభవుఁ డైనరుక్మబా
హున కెఱిఁగింప నాతఁడు సముత్సుకుఁడై యెదురేగి యగ్రపూ
జన మొనరించి తెచ్చి మణిసాంద్రహిరణ్మయపీఠి నుంచినన్.

13


గీ.

కుశల మర్థించి యమ్మునికుంజరుండు, కువలయాధీశ నీపుత్రిఁ గుముదినీల
తాంగి శిశుపాలనృపతినిజాత్మజునకు, నడిగి రమ్మని నను బంచె నాదరమున.

14


[2]మ.

జననాథాగ్రణి యేమి చెప్పుదు భుజాస్తంభోరుకుంభీనసా
భినవక్ష్వేళశిఖాయితాసిముఖనిర్భిన్నారియౌ నాకుమా
రుని[3]యౌదార్యము రూపురేఖయును నోర్పు న్నేర్పుఁ గారుణ్యవ
రనముం కీర్తనము న్బలంబు చలము న్రాదెట్టి రాచూలికిన్.

15
  1. ట-లో 11–12–13 పద్యములకు బదులుగా; వ. విచారించి రుక్మబాహునిపుత్రి యున్కిఁ దెలిసి నిజపురోహితుఁ డగుగాలవాఖ్యునిం బంచిన నతండునుం జని భీమనృపతనూభవుం డైనరుక్మబాహునిం గని. అనువచనము గలదు.
  2. ట-లో నీపద్యము లేదు.
  3. చ-యౌదార్య మవార్యధైర్యమును