పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఘటికాచలమాహాత్మ్యము


అంభోరుహేక్షణా డింభారతాత్ముడై
యంబారుఖానుఁ డత్యంతములుక
సేనతో దీనుఁడై [1]హీనమానతఁబాఱి
ఖానకానుండు బల్ కానకరుగ
చొచ్చి మల్లాదళంబుల సోమసూర్య
వీథు లేర్పడ నఱికిన వీరు డంచు
విజయరమ నవ్య నిజసవ్యభుజ నటింప
రహివహించు మీఱి విచిత్రరాయశౌరి.

39


చ.

అనవరతస్వకారిత మహామహనీయ మఖాన్నభోజన
మ్మున నశనాయలేని సురముఖ్యులబోలె సదాసుఖస్థితిన్
[2]దనరునిజాగ్రహారముల తామరతంపరగా ద్విజేంద్రు లిం
[3]పెనయ విచిత్రరాయధరణీశ్వరుఁ డెంతయు సంత[4]సిల్లెడున్.

40


గీ.

అతని గేహిని భాగాంబ యవనిఁ బొల్చు
నతులగుణముల నల యరుంధతినిఁ బోలి
సురభికీర్తుల చుట్టాల సురభి యగుచు
పతిహితాచారశీల సౌభాగ్యలీల.

41


సీ.

మొగమురాజ దినంబు మిగులమండెడి [5]యౌర్వ
వహ్ని చేపట్టిన స్వాహ యెంత
పునుకకూడు [6]భుజించిమ నెడు శ్రీ [7]కంఠు దా
యకు మెడసాచిన యార్య యెంత
[8]కడిమి శుశ్రుగృహంబు గతియంచుఁ బడియున్న
హరినిఁ గైకొన్న శ్రీతరుణి యెంత
పరకాంతకొఱకు శాపగ్రస్తుఁడైన యిం
ద్రునిఁ గూడిన పులోమతనయ యెంత
యనుచు వారల కర్హనాయకులు లేమి
కాత్మహసియించి సకలగుణాభిరాముఁ

  1. పోనమానతఁ బాఱి పూ.ము.
  2. దనర తా. పూ.ము.
  3. పెనయు తా. పూ. ము.
  4. సిల్లుచున్ తా. పూ ము.
  5. నర్యతా. పూ. ము.
  6. భజించి. తా.
  7. పట్టి తా. పూ. ము.
  8. కలశ్వశురగృహంబు. పూ. ము.