పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

9


గురునుతి సుందరరాయని
[1]తరుణార్కనిభుని విచిత్రధరణివిభునిన్.

35


క.

ఆ సుందరరాయానుజుఁ
డై సుమతి విచిత్రరాయఁ డలరె విచిత్ర
శ్రీసుందరవిగ్రహవని
తాసుమశరుఁ డనఁగఁ గీ ర్తితత్పరుఁ డగుచున్.

36


సీ.

ప్రబలప్రతీపభూపదురాపశౌర్యాగ్ని
తోయధుల్ మరుభూమి సేయుటొకటి
భుజయుగాశ్రితమహాద్భుతహేతిహతి వైరి
వీరుల సురలఁ గావించుటొకటి
చక్రవాళగిరీంద్రసానురత్నంబులఁ
జిరకీర్తిఁ దెల్లగా నెరపుటొకటి
అక్షీణకరుణాకటాక్షవీక్షణమున
నిరుపేదలకు కల్మి నిల్పుటొకటి
ధైర్యమున మేరుఁదృణముగాఁ దలచుటొకటి
పరధనాదులపై నాసపడమియొకటి
యతివిచిత్రనిదానమై యతిశయిల్ల
నతనికి విచిత్రరాయాఖ్య యమరుటరుదె?

37


ఉ.

మల్లవడీపురీశ్వరుఁడు మానితమూర్తి విచిత్రరాయభూ
వల్లభుఁ డామరద్రుమనవప్రసవంబుల నంబరాపగా
ఫుల్లసువర్ణపద్మములఁ బూజలొనర్చు నుమేశు శాంబరీ
భిల్లుని చంద్రశేఖరుని పేర్మి ధరాగతుఁడయ్యు వింతగన్.

38


సీ.

హృత్తాపఘనమైన మత్తాపఘనముతో
ముత్తాపఖానుఁడు మూలకొదుగ
అలబలంబు దొలంగి చలబలావళితోడ
బలబలాఖానుఁడు పరితపింప

  1. తరుణారుణవిభు, తా....నిభు. పూ. ము.