పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

123


గీ.

అనుచుఁ బల్కిన నారదమునివరేణ్యు
తోడ [1]భృగుముని మదిలోన వేడు కలర
ననఘ నీవల్ల సుకృతి నేడైతి ననుచు
నతులు గావించి [2]మించి సమ్మతిని నుండె.

69


ఆశ్వాసాంతము

శా.

దివ్యాహార పయస్సితామధుర మాధ్వీక ప్రవాహోపమా
నవ్యాహార విలాస హావ విలసన్నారీ నవాంభోజినీ
నవ్యాహారమణాపణాయిత బుధా నందానుసంధాన స
ద్రవ్యాహార కుముద్వతీరమణ రారాజద్యశోమండలా.

70


క.

లోచన కమలా విలసన
యాచనక స్థూలలక్ష యౌవత హృదయా
సేచనక నిజౌజోవై
[3]రోచన కౌశిక పతద్విరోధి వరేణ్యా!

71


మాలిని.

సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటౌజా!
పరభటకృతపూజా! బంధుగీర్వాణభూజా!
తరుణతరుణితేజా! ధారుణీరాజరాజా
భరణసుకవిభోజా! భాగమాంబాతనూజా!

72

ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత సరస
కవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన
ఘటికాచల[4]మాహాత్మ్యం బను మహాప్రబంధంబు
నందు సర్వంబును తృతీయాశ్వాసము.

  1. నిట్లను.పూ.ము. తా.
  2. యతఁడు. పూ. ము. తా.
  3. రోచనక కౌశికద్విరాధీవరేణ్యా. తా.
  4. మహత్వం. తా.