పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఘటికాచలమాహాత్మ్యము


దేదీప్యమానమై దీప[1]ప్రతానంబు
రోదసీకుహరంబు రుచులనింప
రత్నయానంబు లందుంచి రాజసమున
మించి తిరువీథు లేగించి రంచితముగ
దిరుగ నగరు ప్రవేశించి దేవదేవు
మంచినైవేద్యముల దనియించి రెలమి.

65


క.

ఈగతి తొమ్మిది దినములు
నాగమవిధి సమ్మతముగ నఖిలోత్సవముల్
రాగిల్లఁ దీర్థవారియు
బాగుగఁ దిరుకోటిడించి ప్రమద మెలర్పన్.

66


క.

ఈవిధమున వైఖానసు
లేవేళ మహోత్సవంబు లెసఁగింపఁగ స
ద్భావమున జనులఁ బ్రోచుచు
నా విభుఁడు సుఖాబ్ధి నోలలాడుచునుండున్.

67


సీ.

అపవర్గకాముల కపవర్గఫలదంబు
ధనకాములకు మహాధనకరంబు
పుత్రార్థులకు బహుపుత్రదాయకము నా
యుష్కాములకు మహాయుష్కరంబు
పాతకహరమును బహురసాలంకార
భావ నానార్థవిభాసురంబు
నఖిలపురాణేతిహాసవిఖ్యాతంబు
పాఠక శ్రావక భాగ్యఫలము
నిఖిలకవిబుధసంస్తవనీయ మయిన
యీచరిత్రంబు నిరతంబు నెసఁగుచుండు
తారకాచంద్రభాస్కరధరణిశైల
శరధు లెందాక నందాక జగతియందు.

68
  1. ప్రతాపంబు పూ. ము.